- కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): వరద బాధితులందరికీ సహాయం అందేలా చూస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని ఖాజాగూడా, దర్గా ముస్లిం బస్తీ, మధురా నగర్ లలో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయిన అందరినీ ఆదుకుంటామని అన్నారు. వారికి అన్నివిధాలుగా సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు గిరి, రమేష్, వీఆర్‌వో శ్రీనివాస్, తెరాస నాయకులు పాల్గొన్నారు.







