మియాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాం: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం పనులను స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగింద‌ని, సాయి నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, సీసీరోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు తెలిపారు. మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయ శక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రతాప్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, శరత్ రెడ్డి, సాయి నగర్ కాలనీ వాసులు దామోదర్ రెడ్డి, కరిముల్లా, శ్రీకాంత్ చౌదరి, లక్ష్మీ నారాయణ, ప్రకాష్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here