ప్రతి కాలనీలో సీసీ రోడ్లు నిర్మిస్తాం

  • కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ ప‌రిధిలోని కైలాష్ నగర్ కాలనీలో రూ.10 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో కొన‌సాగుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. స్థానికంగా ర‌హ‌దారుల్లో గుంత‌లు ప‌డ‌డం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని కాల‌నీవాసులు ఫిర్యాదు చేయ‌డంతో రోడ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు రోడ్ల‌ను అందుబాటులోకి తేవాల‌న్నారు. ప‌నుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను పాటించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాలనీ వాసులు దామోదర్ రెడ్డి, శ‌డక్షరి, సుధాకర్, వర్క్ ఇన్‌స్పె‌క్టర్ జగదీష్ పాల్గొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here