శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ చేయూతనందించాడు. కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన తండ్రిని కోల్పోయిన ముగ్గురు చిన్నారులు తల్లితో కలసి సహాయం కోసం శుక్రవారం ప్రభుత్వం విప్ గాంధీ నివాసం వద్దకు వచ్చారు. కాగా వారి బాదను గుర్తించిన హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ వెంటనే రూ.5 వేల నగదును అభాగ్యులకు అందజేశారు. తండ్రిని కోల్పోయిన వారి బాద తనకు తెలుసని, తనవంతు భాద్యతగా కొంత మొత్తాన్ని అందించగలిగానని కొండా పేర్కొన్నారు.






