చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో ప్రధాన అర్చకుడు సత్యసాయి సూచన మేరకు శ్రీ పద్మావతి అమ్మ వారు, శ్రీ గోదాదేవి అమ్మ వారు, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నూతన పంచలోహ విగ్రహాలను దేవాలయ కార్యవర్గ సభ్యుడు వెంకట శేషయ్య, ప్రసూన దంపతులు తయారు చేయించి శుక్రవారం ఆలయానికి అందజేశారు.







