42 శాతం బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వల్లెపు మాధవరావు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల‌ను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ సమక్షంలో అసెంబ్లీలో తీర్మానం చేయడం సాగతిస్తున్నామని శేరిలింగంపల్లి బీసీ సంఘం అధ్యక్షుడు వల్లెపు మాధవరావు అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రెండోసారి గవర్నర్ దగ్గరికి చేరిన బిల్లు మొదటిసారి అమలు చేయలేకపోయారని, రెండోసారైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్ అమలు చేసే తీరాలని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి సమయం వృధా చేసే విధంగా వారి కార్యాచరణ ఉండకూడదని, రిజర్వేషన్ కల్పించడం వలన బీసీలకు విద్య, ఉద్యోగం, రాజ్యాధికారంలో వాటా కోసం ఎంపీ ఆర్ కృష్ణయ్య, బిసి ప్రజలు సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేస్తున్నామని అన్నారు. అసెంబ్లీ తీర్మానంతో పబ్బం గడపకుండా 10 రోజుల వ్యవధిలో గవర్నర్, కేంద్రంలో బిల్లు ఆమోదించి తెలంగాణ బిసి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here