ఏ ఎన్నిక జ‌రిగినా బీజేపీ గెలిచేలా కృషి చేయాలి: ర‌వికుమార్ యాద‌వ్‌

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్, హుడా కాలనీ, హఫీజ్ పేట్ గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ హుడా కాలనీలో సీనియర్ నాయకుడు సత్యనారాయణ, విష్ణు దత్, హఫీజ్ పేట్ గ్రామంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలలో ర‌వికుమార్ యాద‌వ్‌ పాల్గొని జెండాల‌ను ఎగురవేశారు. ఈ సందర్భంగా ర‌వికుమార్ యాద‌వ్‌ మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమై, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతా వాదానికి కట్టుబడి, పంక్తిలో చివరి వ్యక్తికి తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, అటల్, అద్వానీ తదితర అగ్రనేతల మార్గదర్శకత్వంలో అమిత్ షా , జేపీ నడ్డా నాయకత్వంలో 14 కోట్ల సభ్యత్వాలు, 10 లక్షల బూత్ లకు గాను 7,60,000 బూత్ కమిటీలు, 17,000 డివిజన్ల‌ కమిటీలు,950 జిల్లాల కమిటీలు,33 రాష్ట్రాల అధ్యకులతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచంలో భరతమాతను విశ్వ గురువుగా నిలిపే యజ్ఞంలో భాగమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మద్దతుదారులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన‌న్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ప్రతి నాయకుడు, కార్యకర్త పాల్గొని దొంగవోట్లు, తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా సిద్ధం చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో వచ్చే సైబరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు ఇప్పటి నుండే పనిని ప్రారంభించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుపు సీఎంసీ ఎన్నికల నుండి ప్రారంభమై రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా గెలిచేందుకు మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరు త‌మ‌ వంతు కృషి చేయాలన్నారు. డివిజన్ అధ్యక్షులు జితేందర్, రాధాకృష్ణ యాదవ్ , రమణయ్య , శ్రీనివాస్ యాదవ్, రాజు, శ్రీశైలం కురుమ, శ్రీధర్ గౌడ్, రంగారెడ్డి, జగన్ గౌడ్ , రవి, శ్రీనివాస్, మనోజ్ యాదవ్, రాజు, పద్మ, వినయ్, శివ కుమార్ యాదవ్, రమేష్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here