రహేజా మైండ్‌స్పేస్‌లో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన కూలింగ్ టవర్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రహేజా మైండ్‌స్పేస్‌లోని బిల్డింగ్ నంబర్‌ 1లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం పైభాగంలోని (టెర్రస్‌) కూలింగ్ టవర్ల సమీపంలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వెల్డింగ్ సమయంలో వెలువడిన నిప్పురవ్వలు, మంటలు కూలింగ్ టవర్లకు వ్యాపించడంతో ఒక కూలింగ్ టవర్‌కు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రస్తుతం మంటలు పూర్తిగా ఆర్పివేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here