శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సంజీవ రెడ్డి, బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, సాంబయ్య, ప్రభాకర్ తదితరులతో పాటు పలువురు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.






