నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్లలో అసంపూర్తిగా ఉన్న మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టి ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులకు సూచించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ లో నూతనంగా నిర్మించనున్న మంజీర వాటర్ పైప్ లైన్ల పనులపై వాటర్ వర్క్స్ డీజీఎం ఉమాపతి, కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నల్లగండ్ల లో మిగిలిన వాటర్ వర్క్స్ పనులను త్వరగా పూర్తి చేపట్టి ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కళల ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి మంచి నీటి నల్లా కనెక్షన్, ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగు నీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.