నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, అన్ని రంగాలలో అభివృద్ధి చేసి లక్ష్మీనగర్ ను ఆదర్శ కాలనీ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మి నగర్ కాలనీ వాసులు కాలనీ లో ఉన్న పెండింగ్ సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. కాలనీవాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని త్వరలోనే పరిష్కరిస్తామని హామినిచ్చారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.