నీట మునిగిన గంగారం హనుమాన్ దేవాలయ సెల్లార్… కూలిపోయిన వంట గది…

  • ఒక్కసారిగా పగిలిన పైప్ లైన్… పైకి తన్నుకొచ్చిన నీరు…
  • ప్రమాదంలో గాయాల పాలయిన ప్రసాదాలు వండే మహిళ…

నమస్తే శేరిలింగపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం హనుమాన్ దేవాలయం సెల్లార్ నీట మునిగింది. శనివారం రాత్రి గంగారం హనుమాన్ దేవాలయం సమీపంలోని పైప్ లైన్ లీకేజీ అయ్యింది. భారీ పైప్ లైన్ పగిలిపోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున తాగునీరు బయటకు తన్నుకొచ్చింది. ఈ నేపధ్యంలో ఆలయం కింద ఉన్న సెల్లార్ లో భారీ ఎత్తున నేరు చేరింది. నీటి ప్రహావ తీవ్రతకు ఒక రూమ్ కూలిపోయింది. ఈ క్రమంలో ఆ గదిలో ప్రసాదాలు వండే మహిళ(దుర్గమ్మ) గాయాల పాలయ్యింది. వెంటనే ఆలయ కమిటి సభ్యులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ మంజులా రఘునాథ్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. జలమండలి అధికారులతో మాట్లడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here