శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని రాజారామ్ కాలనీలో రఘునాథ్ రావు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ (PAC) చైర్మన్ ఆరెకపూడి గాంధీ, బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి శ్రీకాంత్, శ్రీనివాస్ యాదవ్, చంద్రకాంత్ పాల్గొన్నారు. అనంతరం భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ వేసవిలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన రఘునాథ్ రావుని అభినందించారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఈ కఠినమైన ఎండల్లో ప్రజలకే కాకుండా మూగజీవాలకు, పక్షులకు కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, రాజారామ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.






