నమస్తే శేరిలింగంపల్లి: వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి సన్నాహక సమావేశంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి పాల్గొన్నారు. వరంగల్‌లో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ జింతెందర్రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, వరంగల్ జిల్లా ఇంచార్జ్ మీసాల చంద్రయ్య, రావు పద్మ, రంగారెడ్డి అర్భన్ జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు హనుమంత్ నాయక్‌లతో పాటు గంగాధర్‌రెడ్డి భాగస్వామ్యమయ్యారు. ఎన్నికలలో బిజెపిని విజయతీరాలకు చెర్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ అరాచకాలను, అవినీతి, అక్రమాలను ఎండగడుతూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పధకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.