వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ ఇంచార్జ్ ఉప్పల విద్యా కల్పన ఆధ్వర్యంలో డివిజన్ బిజెపి నాయకుడు ఏకాంత్ గౌడ్ స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల విద్యా కల్పన ఏకాంత గౌడ్ మాట్లాడుతూ వివేకానందుడి జీవితం యువతకు ఆదర్శం అని అన్నారు. స్వామి వివేకానంద చెప్పిన వాక్యాలు బలమే జీవనం, బలహీనతే మరణం, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రకఠోరమైన మనస్సుగల యువతే తన ఆశాజ్యోతి అని, లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించకూడదనే సందేశాలతో నినదించారని అన్నారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నామాలశ్రీనివాస్, అశోక్, దయాకర్ రెడ్డి, బొట్టు శ్రీను, నవీన్, రాజు, సంతోష్, భాను యాదవ్, రాజు గౌడ్, శ్రీనివాస్, తిరుపతి, జితేందర్, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/01/vidya-1-1024x588.jpg)
![](https://namastheslp.com/wp-content/uploads/2021/01/vidya-2.jpg)