చందానగర్ డివిజన్ లో ఘనంగా విజయ్ దివ‌స్

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో విజయ్ దివ‌స్ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ సామ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పార్నంది శ్రీకాంత్, వాలా హరీష్, సంగారెడ్డి, కిరణ్ యాదవ్, అల్లావుద్దీన్, రామకృష్ణ గౌడ్ లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, తెలంగాణ తల్లి, కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, తెలంగాణ ఏర్పాటు విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. ఈ సంద‌ర్భంగా సామ వెంకట్ రెడ్డి, బొబ్బ నవత రెడ్డి, శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని విజయ్ దివ‌స్ గా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

విజయ్ దివ‌స్ చరిత్రలో నిలిచిపోయే రోజు అని అన్నారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి అప్ప‌టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్ర‌క‌టించింద‌ని అన్నారు. అలాగే ఆ రోజే కేసీఆర్ 11 రోజుల దీక్ష ముగిసింద‌ని అన్నారు. 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వలన ఒక రూపం వచ్చిందని అని, అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజుగా గుర్తు చేసుకోవడం జరిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, సలీం, బాల్ రాజ్, బాబు మల్లేష్, రాజు, గణేష్ రెడ్డి, గౌస్, వంశీ, శ్రీను, శివ, సునీత, శబ‌నా, అనంత రెడ్డి, మల్లేష్, గిరి, అష్రాఫ్, నగేష్ రెడ్డి, బాబా, జె. వి.రావు, దొంతి చిన్న, రాజ్ కుమార్, గిరి, ఉపేందర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here