నమస్తే శేరిలింగంపల్లి: పోస్టల్ శాఖ ఆద్వర్యంలో విద్యార్థులకు అంతర్జాతీయ లేఖ రచన పోటీలు-2021 నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు “కొవిడ్ -19 కాలంలో నాకు ఎదురైన అనుభాలు” అనే అంశం పై 800 పదాలకు మించకుండా లేఖను రాసి, తమ పూర్తి పేరు, ఫోటో, చిరునామా, వయసు ధ్రువీకరణ పత్రాలను పోస్టల్ శాఖ తెలిపిన విధంగా ఇతర వివరాలు జత చేసి నోడల్ ఆఫీసర్ కు పంపించాలని సూచించారు. ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులు 15 సంవత్సరాల లోపు వయసు ఉండాలన్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా విద్యార్థులు తమ లేఖ ను ఇంటి నుండి పూర్తి చేసి, తమ పూర్తి వివరాలతో నోడల్ ఆఫీసర్ ఎం. మన్మధరావు, అసిస్టెంట్ డైరెక్టర్ (Rectt & Technical), O/o సిపిఎంజి, తెలంగాణ సర్కిల్, డాక్ సదన్ అబిడ్స్, హైదరాబాద్ -500001 అనే చిరునామాకు ఏప్రిల్ 5 తేదీ లోపు పంపించాలని అన్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, తృతీయ బహుమతిగా రూ.5 వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలు కోసం వెబ్ సైట్ http://www.indiapost.gov.in ను సంప్రదించవచ్చని తెలిపారు.