నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట బస్తీలో శుక్రవారం చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను బస్తీవాసులు రఘునాథ్‌రెడ్డికి తెలియజేశారు. అదేవిధంగా అక్కడ కొనసాగుతున్న ఓపెన్ నాలాల పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. అధికారులతో మాట్లాడి బస్తీలోని రహదారులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవైపు కరోనా విజృంభన, మరోవైపు వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో బస్తీవాసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్భర్‌ఖాన్, ఓర్సు వెంకటేశ్వర్లు, కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు.