జ్ఞానేశ్వ‌ర్ దంప‌తుల సేవకు తిరుమ‌లేష్ తోడ్పాటు… క‌రోనా రోగుల భోజ‌నానికి రూ.10 వేలు ఆర్ధిక సాయం…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కరోనా‌ భారిన పడి హొం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ రోగుల‌కు కంది‌ జ్ఞానేశ్వర్ కస్తూరి జ్యోతి దంపతులు నిత్యం‌ మంచి పోషక ప‌దార్థాల‌తో కూడిన‌ భోజనం అందజేయడం అభినంద‌నీయ‌మ‌ని శేరిలింగంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్ల తిరుమలేష్ అన్నారు. కంది జ్ఞానేశ్వర్ దంపతులు చేస్తున్నసేవ‌కు తోడ్పాటుగా గుర్ల‌ తిరుమలేష్ రూ. 10 వేల అర్ధిక‌సాయం చేశారు. అందుకు సంబంధించిన చెక్‌ను శ‌నివారం కంది జ్ఞానేశ్వ‌ర్ క‌స్తూరీజ్యోతి దంప‌తుల‌కు తిరుమ‌లేష్ అంద‌జేశారు. కరోనా సోకిన వారు ఇంటి నుంచి బయటకు రాలేక పూట గడవని పరిస్థితుల్లో ఉన్న వారికి కంది‌ జ్ఞానేశ్వర్ దంపతులు ప్రతి రోజు ఉచితంగా నాణ్యమైన ‌భోజనం అందజేస్తు మావ‌త్వాన్ని చాటుతున్నార‌ని, వారు చేస్తున్న సేవ‌కు త‌న వంతుగా స‌హ‌కారం అందించ‌డం ఎంతో సంతృప్తిని ఇస్తుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన నాయకులు ఆశిల శివ, బల్ల నరేందర్, మధు కుమార్ త‌దితరులు పాల్గొన్నారు.

కంది జ్ఞానేశ్వ‌ర్ క‌స్తూరీజ్యోతి దంప‌తుల‌కు రూ.10 వేల చెక్‌ను అంద‌జేస్తున్న తిరుమ‌లేష్‌
Advertisement

1 COMMENT

  1. We are very much proud of Sri, Kandi Gnaneshwar and Jyothi garu the wonderful couple made for each other for their culture by doing seva distributing healthy higenic food for the essentially needed people in this pandamic situation by taking very high risk that is putting their entire family’s health in high risk. I bow my head to them, and the gentle men who has encouraged them by donation rs. 10 thousands my heartful thanks to him. Jai Sree RAM. Bharat mata ki jai.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here