టిమ్స్ హాస్పిట‌ల్‌లో హ‌రిత‌హారం… మొక్క‌లు నాటిన ప్ర‌భుత్వ విప్ గాంధీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలి డివిజన్ పరిధిలోని టిమ్స్ ద‌వాఖానా ప్రాంగణంలో శుక్ర‌వారం హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. బ‌యోడైవ‌ర్సిటీ డిప్యూటీ డైరెక్ట‌ర్ నీర‌జ గాంధీ, కార్పొరేట‌ర్లు మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి, ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌, మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబాల‌తో క‌ల‌సి ప్ర‌భుత్వ విప్ గాంధీ టిమ్స్ ప్రాంగ‌ణంలో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామ రక్ష అని, ప్రతిఒక్కరు తప్పనిసరిగా, విరివిగా మొక్కలు నాటాలని, మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటాడమే కాకుండా వాటిని సంరక్షించి పెద్దవి చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతా ప్రతి ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింద‌ని, అదేవిదంగా టిమ్స్‌ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటడం ద్వారా రోగులకు, వారి సహాయకులకు సేద తిరడానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు. ఆహ్లదకరమైన వాతావరణం అందించడానికి, స్వచ్ఛమైన గాలికి చెట్లు ఎంతగానో తోడ్పడుతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ, గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్‌ అధ్యక్షులు రాజు నాయక్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు నాయి నేని చంద్రకాంత్, సత్యనారాయణ, సురేందర్, రమేష్, గురుచరణ్ దూబే, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.

టిమ్స్ ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటుతున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, బ‌యోడైవ‌ర్సిటీ డిప్యూటీ డైరెక్ట‌ర్ నీర‌జ గాంధీ, జ‌డ్సీ ర‌వికిర‌ణ్‌, కార్పొరేట‌ర్లు, నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here