శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): వాసవి మాత జయంతి సందర్భంగా చందానగర్ హుడా కాలనీలో ఉన్న వాసవి మాత ఆలయంలో సహస్రాభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతనం అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లిలోని ఆర్య వైశ్యులు అధిక సంఖ్యలో వాసవి మాత దర్శనం చేసుకున్నారు. చైర్మన్ పోలా కోటేశ్వర రావు, వాణి జితమన్యు, శ్రీకాంత్, రజిని, మారం వెంకట్, కవిత, వినయ్, ధనలక్ష్మి, రాము, సుకన్య, ఉషారాణి, విజయ్ రావు, సుదర్శన్ రావు, నాగ శాంతి, పోల సాయిబాబు, సుజాత, కృష్ణ మూర్తి, బాలరాజు, ప్రసాద్ ప్రవీణ్ పాల్గొన్నారు.






