ప్ర‌శాంత్‌న‌గ‌ర్‌, కృషిన‌గ‌ర్ ముంపు స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం: ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, కృషి నగర్‌లోని ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి రూ.70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న వరదనీటి కాలువ‌ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వవిప్‌ ఆరెక‌పూడి గాంధీ ప్ర‌త్యేక దృష్టి సారించార‌ని అన్నారు. మియాపూర్ డివిజ‌న్‌లో అభివృద్ధి ప‌నుల నిరాటంకంగా కొన‌సాగుతున్నాయ‌ని అన్నారు. నాణ్యత విషయంలో రాజి పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో వర్క్ ఇన్స్‌పెక్ట‌ర్ జ‌గ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

వ‌ర‌ద‌నీటి కాలువ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here