నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్, కృషినగర్లలో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుక్రవారం పర్యటించారు. ప్రశాంత్ నగర్, కృషి నగర్ లోని వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.70 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న వరదనీటి కాలువ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వర్షాలు మొదలైన నేపత్యంలో యుద్ధ ప్రాతిపధకన పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల్లోని నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడే పరిస్థితే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ ముదిరాజ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.