నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజత్ నగర్ వికర్ సెక్షన్ స్మశానవాటికను స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి కార్పొరేటర్ వి.జగదీశ్వర్‌గౌడ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఇజ్జత్‌నగర్ వికర్ సెక్షన్‌లో నివాసముండే ప్రజలు ఎన్నో సంవత్సరలుగా ఇక్కడ ఖర్మకాండలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఐతే ఈ స్మశాన వాటిక స్థలం విషయంలో తలెత్తిన సమస్యను ప్రభుత్వ విప్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. గాంధీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారని నమ్మకముందని అన్నారు. శ్మశాన వాటికను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధికి కృషిచేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బ్రమయ్య యాదవ్, తైలి కృష్ణ, రామచందర్, రంగా స్వామి, నర్సింగ్ నాయక్, కృష్ణ నాయక్, సత్తి రెడ్డి, వెంకట్ స్వామి, రామకృష్ణా, నారాయణ, తర్య నాయక్, చక్రి,సీతమ్మ,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
