టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వాణీదేవికి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం సంపూర్ణ మ‌ద్ధ‌తు

  • సంఘీబావ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన మంత్రి హ‌రీష్‌రావు, ప్ర‌భుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్సీలు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉమ్మ‌డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా టీఆర్ఎస్‌‌ పార్టీ బలపరిచిన వాణి దేవికి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం సంపూర్ణ మ‌ద్ధ‌తు తెలిపింది. మియ‌పూర్ న‌రేన్ గార్డెన్స్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ హరీష్ రావు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, చేవెళ్ల పార్ల‌మెంట్ స‌భ్యులు డాక్ట‌ర్ గ‌డ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డిల‌తో క‌ల‌సి టీపీయూఎస్‌ రాష్ట్ర అధ్య‌క్షులు గంధం రాములు సంఘీభావ పోస్టర్‌ను విడుదల చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉమ్మ‌డి జిల్లాలలోని ప్రైవేట్ ఉద్యోగుల్లో ఉన్న ప‌ట్ట‌భ‌ద్రులు వాణీదేవికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని ఈ సంద‌ర్భంగా గంధం రాములు పిలుపునిచ్చారు.

సంఘీబావ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన మంత్రి హ‌రీష్‌రావు, ప్ర‌భుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, మ‌హేంద‌ర్ రెడ్డి, గంధం రాములు, శేరిలింగంప‌ల్లి కార్పొరేట‌ర్లు

ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంప‌ల్లి కార్పొరేట‌ర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నే శ్రీనివాస రావు, పూజిత గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి, రోజాదేవి రంగరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, సంఘం రాష్ట్ర‌ కార్యదర్శులు భాస్కర్‌, పీవై రమేష్, నాయ‌కులు జీవనంద్, ఆశిల శివ, మోహన్ నాయక్, రుప్ సింగ్, చంద్రమోహన్, గౌని శ్రీనివాస్, విద్యాసాగర్, నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here