నమస్తే శేరిలింగంపల్లి: బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్ సోదరి శిరీష – అవినాష్ కుమార్ల వివాహ మహోత్సవం నార్సింగ్‌లోని ది అడ్రెస్ కన్వెన్షన్‌లో గురువారం ఘనంగా జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత అతిథుల నడుమ వివాహం వైభవంగా నిర్వహించారు. బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నాయకులు ఎల్లేష్‌లు వివాహ వేడుకకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో వదువు తండ్రి మారబోయిన రాజు యాదవ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.