ఏఎస్‌రాజు న‌గ‌ర్‌, జేపీఎన్ న‌గ‌ర్‌ల‌లో శానిటైజేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్‌… ప‌ర్య‌వేక్షించిన కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని అల్లూరీ సీతారామ‌రాజున‌గ‌ర్‌, జేపీఎన్ న‌గ‌ర్‌ల‌లో స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ గురువారం ప‌ర్య‌టించారు. క‌రోనా ఉదృతి కొన‌సాగుతున్న నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్‌ సిబ్బందిచే కాల‌నీలోని ప్ర‌తి వీధిలో హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారి చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం త‌ర‌పున చేయాల్సిన కార్య‌క్ర‌మాలు ప‌క‌డ్భందిగా చేప‌డుతున్నద‌ని, ఐతే వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌జ‌ల స్వీయ నియంత్రణ ఎంతో ముఖ్యమ‌ని అన్నారు. అంద‌రు విధిగా మాస్కులు ధ‌రించాల‌ని, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, భౌతిక దూరం పాటించాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏఈ గ‌ణేష్‌, ఎస్ఆర్‌పీ క‌న‌క‌రాజు, కాల‌నీ వాసులు శ్రీనివాస్‌, నాగ ప్ర‌వీణ్‌, కృష్ణంరాజు, రాము త‌దిత‌రులు పాల్గొన్నారు.

డీఆర్ఎఫ్ సిబ్బందిచే సోడియం హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారి చేయిస్తున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here