శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పుటూరి మధు కుమార్ తన జన్మదినం సందర్బంగా చందానగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు చేయూతను అందించడంలో తాను ముందుంటానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఊరికి పేరు తీసుకురావాలని, దాతలు అందించే సహాయాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.






