స‌మిష్టిగా కృషి చేసి ఉప్ప‌ల‌పాటిని గెలిపించుకుంటాం

  • మియాపూర్ డివిజ‌న్‌ సీనియ‌ర్ నేత‌ల‌ తీర్మాణం

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ నుంచి అధికార‌పార్టీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ పేరు ఖ‌రార‌య్యింది. అక్క‌డి నుంచి టిక్కెట్ ఆశించిన వారితో పాటు పలువురు సీనియ‌ర్ నేత‌లు బుద‌వారం రాత్రి ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌జాక్షేత్రంలో టిక్కెట్ ఆశించ‌డం ప్ర‌తీ కార్య‌క‌ర్త హ‌క్కు అని, ఐతే పార్టీ హైక‌మాండ్ ఆదేశించిన అభ్య‌ర్థిని గెలిపించుకోవాల్సిన భాద్య‌త సైతం ప్ర‌తీ కార్య‌క‌ర్త పైన ఉంటుంద‌ని ప్ర‌భుత్వ విప్ గాంధీ సూచించారు. కాగా ఆశావాహులంతా స‌మిష్టిగా కృషి చేసి భారీ మెజారిటీతో ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌ను గెలిపించుకుంటామ‌ని తీర్మాణం చేశారు. అనంత‌రం శ్రీకాంత్‌ను స‌న్మానించి వారంతా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. గాంధీని క‌లిసిన వారిలో సీనియ‌ర్ నాయ‌కులు సిద్దిన‌బోయిన పురుషోత్తం యాద‌వ్‌, అన్వ‌ర్ ష‌రీఫ్‌, చంద్రిక ప్ర‌సాద్ గౌడ్‌, గంగాధ‌ర్‌రావు, బండారు మ‌హెంద‌ర్ ముదిరాజ్ త‌దిత‌రులు ఉన్నారు.

మియాపూర్ డివిజ‌న్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌ను స‌న్మానిస్తున్న డివిజ‌న్‌ సీనియ‌ర్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here