ఆరంభ్ టౌన్‌షిప్‌లో బుద్ధుడి విగ్రహావిష్కరణ

శేరిలింగంప‌ల్లి, జూన్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్ప-ఆరంభ్ టౌన్‌షిప్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, అహింస, సమానత్వం, మానవతా విలువలు సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైన మార్గదర్శకాలుగా నిలుస్తాయని అన్నారు. జీవితంలోని బాధలకు కారణాలను తెలుసుకుని వాటికి పరిష్కారం కనుగొనే క్రమంలో బుద్ధుడు రాజభవనాన్ని విడిచి తపస్సు చేశాడ‌ని, అనేక సంవత్సరాల ధ్యానం అనంతరం ఆయనకు జ్ఞానోదయం కలిగిందని పేర్కొన్నారు.

మన కోరికలే బాధలకు ప్రధాన కారణమని, మంచి ఆలోచనలు, సత్కార్యాల ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని బుద్ధుని బోధనలు తెలియజేస్తున్నాయని రవికుమార్ యాదవ్ అన్నారు. బుద్ధుడి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, విజయలక్ష్మి, అజయ్, రమేష్, నరసింహ, శ్రీనివాస్, బసవయ్య, జ్యోతి, మీనమ్మ, లక్ష్మి, రాజమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here