అసంపూర్తి పనులు త్వర‌గా పూర్తయ్యేలా చూడాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ ప్రశాంతి, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని ఆయా డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ఉప కమిషనర్ తో చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ మెహ్రా ,ACP వెంకటరమణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here