నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంటలో అనారోగ్యంతో బాదపడుతున్న మహిళను స్థానిక కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం పరామర్శించారు. వేముకుంటలో నివాసం ఉండే ఫర్హాన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతుంది. ఆమె తాజా ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ విప్, కార్పొరేటర్లు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ అధైర్య పడవద్దని, అన్ని విధాలుగా ఆదుకుంటామని ఫర్హానకు భరోసా ఇచ్చినారు. అదేవిధంగా ఆమె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయం కింద చందానగర్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ ఇరవై ఐదు వేల రూపాయలను బాధిత మహిళకు అందజేశారు. అదేవిధంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.