నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్‌ల ఆద్వర్యంలో సుభాష్‌చంద్రబోస్ నగర్ చిల్లా దర్గా వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ విప్లవ్‌కుమార్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ కార్యకర్తలు సుధాకర్ గౌడ్, టి.అరవింద్ సింగ్, హాశం, నజీర్, ఖలీల్, ఖాజా, విజయ్, మహేష్, అంజాద్, పవన్ తదితరులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గాంధీ, విప్లవ్‌కుమార్, స్థానిక కార్పొరేటర్లు పూజితా జగదీశ్వర్‌గౌడ్‌లు ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తెలంగాణ యాదిలో, తెలుగు జనుల మదిలో నిండుగా నిలిచే ఠీవి..మన పీవీ అని అన్నారు. అసమాన రాజనీతి వేత్త, ఆర్థిక మహాసంస్కర్త, తెలంగాణ ముద్దుబిడ్డ, భూమిపుత్రుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, విద్యావేత్త, నిర్మల మనస్వి హైదరాబాద్-రంగారెడ్డి -మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పట్ల ఆర్థిక వివక్ష చూపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు జరగటం లేదు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
