తెరాస హిందూ వ్య‌తిరేకుల పార్టీ: చింతకింది గోవర్ధన్ గౌడ్

శేరిలింగంపల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెరాస హిందూ వ్యతిరేకుల పార్టీ అని రంగారెడ్డి (అర్బన్) జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ అన్నారు. వరంగల్ జిల్లా పరకాల తెరాస ఎమ్మెల్యే ధర్మారెడ్డి రామమందిర‌ నిర్మాణం, నిధి సేక‌ర‌ణల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై పెట్టిన అక్ర‌మ కేసుల‌ను ఎత్తి వేయాల‌ని డిమాండ్ చేస్తూ శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని ఆద‌ర్శ్ న‌గ‌ర్ లో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. అభిరుచి హోట‌ల్ నుంచి లింగంప‌ల్లి ఎక్స్ రోడ్డు హ‌నుమాన్ ఆల‌యం వ‌ర‌కు శ్రీ‌రాముని చిత్ర‌ప‌టంతో పాద‌యాత్ర చేస్తూ ర్యాలీ నిర్వ‌హించారు.

శ్రీ‌రాముని చిత్ర‌ప‌టంతో ర్యాలీ నిర్వ‌హిస్తున్న చింతకింది గోవర్ధన్ గౌడ్, ర‌వికుమార్ యాద‌వ్‌, బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

ఈ సంద‌ర్భంగా చింతకింది గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ హిందూ వ్యతిరేకుల పార్టీ అని ధ్వ‌జమెత్తారు. రామ‌మందిర నిర్మాణం, నిధి సేక‌ర‌ణ‌ల‌పై తెరాస ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని, వారిపై పెట్టిన అక్ర‌మ కేసుల‌ను కొట్టి వేయాల‌ని డిమాండ్ చేశారు.

హ‌నుమాన్ ఆల‌యం వ‌ద్ద మాట్లాడుతున్న చింతకింది గోవర్ధన్ గౌడ్

ఈ కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్, డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి, సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్, కర్చేర్ల ఎల్లేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు ప్రశాంత్ చారి, చిట్టారెడ్డి ప్రసాద్, సత్య కురుమ, మనోజ్ ముదిరాజ్, శ్రావణ్ పాండే, కొడిదెల బాబు, రజనీ, కౌసల్య, కాంచన కృష్ణ, కుమార్ యాదవ్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి సాయి కుమార్, యువమోర్చా ప్రధాన కార్యదర్శులు బొట్టు కిరణ్, రపన్ మహేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణ కుమారి, గిరిజన మోర్చా అధ్యక్షుడు అశోక్ నాయక్, కార్యకర్తలు, రామసేవకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here