శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) కార్యాలయంలో నూతనంగా నియమితులైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బుందరపు నరసయ్య గౌడ్ సమక్షంలో రంగారెడ్డి జిల్లా స్థాయి నాయకులు విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీని జిల్లా స్థాయి నుంచి గ్రామ, వార్డు స్థాయిల వరకు విస్తరించి, పార్టీ ఆదేశాలు, ఆశయాలను ప్రతి ఇంటికి చేరేలా చేయాలని నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అన్ని స్థాయిల్లో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీ కార్యకలాపాల్లో వారికి మొదటి అవకాశం కల్పించాలని సూచించారు. పార్టీ అభివృద్ధి దిశగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని, ప్రజల సమస్యలపై చురుకుగా స్పందిస్తూ పార్టీని బలంగా నిలబెట్టాలని నిర్ణయించారు.

ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో TRP మరింత బలోపేతం అవుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్, మహిళ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసుకి, ఉపాధ్యక్షుడు పొనుగోటి సందీప్, అధికార ప్రతినిధి శాకరోళ్ల సురేష్ ముదిరాజ్, యూత్ ప్రెసిడెంట్ శాగంటి శ్రీనివాస్, మద్దెగూడెం జనార్దన్ ముదిరాజ్, బొంగు వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు.





