రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాషా-సాంస్కృతిక ఉత్సవాలు.. కథా కథనం పోటీల్లో త్రివేణి విద్యార్థి విరూపాక్ష సత్తా..

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలుగు భాషా-సాంస్కృతిక ఉత్సవాలు-2026 పోటీల్లో త్రివేణి టాలెంట్ స్కూల్‌ (లింగంపల్లి బ్రాంచ్) విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. తెలుగు కథా కథనం పోటీల్లో ఏడో తరగతికి చెందిన వి. జయ కృష్ణ దత్త విరూపాక్ష ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.

విజేతలైన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో త్రివేణి స్కూల్ డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, మియాపూర్ జోన్ సీఆర్‌ఓ సాయి నరసింహారావు, ఏసీఆర్‌ఓ నరేష్ పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here