శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ నడిగడ్డ తాండ ఎంసీపీఐ (యూ) గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతిని దేవనూర్ నర్సింహా అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తొలి దశ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి మద్ధికాయల ఓంకార్ అని అన్నారు.
చట్టసభలలో వరుసగా 5 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం బడుగు బలహీన ఆదివాసీ గిరిజనుల, పీడిత ప్రజల గొంతుక అయినందుకు ప్రజలే ఓంకార్ ని అసెంబ్లీ టైగర్ గా సంబోధించారని అన్నారు. జనాభాలో 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలైన బహుజనులకి రాజ్యాధికారం దక్కాలని కమ్యూనిస్టు పార్టీలను ఏకతాటిపై తీసుకువచ్చిన వ్యక్తి మద్ధికాయల ఓంకార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు డి.లక్ష్మి, నర్సింహా, డివిజన్ కమిటీ సభ్యులు ఎస్.కె గౌసియా బేగం, గ్రామ సభ్యులు ఖైరునిషాసా బేగం, చాన్ బి, ముఖేశ్వరి, జేబునిషా బేగం, రాములు తదితరులు పాల్గొన్నారు.