నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని హుడాకాలనీ లో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ నూతన కార్యాలయాన్ని శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఆగస్టు 24 నుండి ప్రారంభమయ్యే ప్రజా సంగ్రామ యాత్రకు సంఘం పూర్తి స్థాయి మద్దతు తెలుపుతూ, యాత్ర విజయవంతం చేయడంలో ప్రథమ భూమిక వహిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికిరణ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లలిత, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చిట్టా రెడ్డిప్రసాద్, గ్రేటర్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ చారి, కమిటి సభ్యులు భరత్ రాజ్, గోవర్ధన్ రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, రాఘవేంద్ర, శ్రీను, శ్రీధర్, రామకృష్ణారెడ్డి, శేరిలింగంపల్లి అధ్యక్షుడు అశోక్ ముదిరాజ్, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు గాయత్రి, నివేదిత, తదితరులు పాల్గొన్నారు.