నమస్తే శేరిలింగంపల్లి:శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జన ప్రియనగర్ శ్రీ మహాలక్ష్మీ దేవి దేవాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ దేవి ఆశీస్సులతో సిరి సంపదలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.