శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): టి. పి. సి. సి. లేబర్ సెల్ ద్వారా తెలంగాణ లో అన్ని జిల్లాల లో నియోజకవర్గాలలో కర పత్రాల ద్వారా సభల ద్వారా, తెలంగాణ భవన నిర్మాణ కార్మికులు, ఇతర నిర్మాణ కార్మికులు, అన్ని వాణిజ్య సంస్థలలో, పరిశ్రమలలో పని చేసే అర్హులైన కార్మికుల సంక్షేమం కోసం కార్మిక సంక్షేమ మండలి ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భీమా పథకాలు, సామజిక భద్రత కోసం, కార్మికుల హక్కుల కోసం తదితర ప్రొయోజనాలు కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఉన్నందున వాటి ప్రయోజనాలు లబ్ధిపొందడం కోసం కార్మికులకు అవగాహనా కార్యక్రమాలు చేసేందుకు టి. పి. సి. సి. లేబర్ సెల్ ద్వారా కృషి చేస్తామని టి.పి. సి. సి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి వివరించారు. ఆయన చేతుల మీదుగా కర పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ కార్మికుల సంక్షేమం కోసం శ్రమించి కస్టపడి పని చేస్తున్న టి. పి. సి. సి. లేబర్ సెల్ నాయకులను అభినందించారు .ఈ కార్యక్రమం లో రాంబాగ్ ప్రకాష్ గౌడ్ (చైర్మన్ ), నల్ల సంజీవ రెడ్డి , R. సుజీత్ గాంధీ, సప్పిడి భాస్కర్, కాందాడి సుదర్శన్ రెడ్డి, రమేష్, వీరేందర్ గౌడ్, తిరుపతి, మోహన్ రెడ్డి, మహేష్ , A. శ్రీధర్ గౌడ్, ఎండీ నయీమ్, దుర్గా సింగ్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.