క్రికెట్ టోర్న‌మెంట్ విజేత‌ల‌కు బ‌హుమతుల ప్ర‌దానం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పటాన్‌చెరు నియోజకవర్గంలో అమీన్‌పూర్ మున్సిపాలిటీ ఐలాపూర్ లో బి ఆర్ఎస్ యూత్ నాయకుడు ఐలాపూర్ మాణిక్యం యాదవ్ ఆధ్వర్యంలో ఐలాపూర్ గ్రామంలో నిర్వహించిన కేసిఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో పరిగి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే , బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుభేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఐలాపూర్ మాణిక్ యాదవ్ యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. సమాజంలో ఈ రోజు యువత డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల్లో మునిగితేలుతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు యువతకు ఉత్తేజాన్నిస్తాయ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా లక్ష రూపాయలు మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి యాభై వేలు, మూడో బహుమతి 30,000, విజేతలకు ట్రోఫీల‌ను అంద‌జేశారు.

విజేత‌ల‌కు బహుమ‌తుల‌ను అంద‌జేసిన భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్

ఈ కార్యక్రమంలో ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, పాములేటి యాదవ్, అందెల కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రధాన కార్యదర్శి డబ్బు కొట్టు హరిబాబు యాదవ్, డి కృష్ణ యాదవ్, భవాని డిజిటల్ ప్రోప్రైటర్ కృష్ణ యాదవ్, బిల్డర్ రమేష్ యాదవ్, మాధవ్, బసవరాజు యాదవ్, డొక్కు వెంకటేశ్వర్లు యాదవ్, మధు యాదవ్, కాశయ్య యాదవ్, రఘురాం, రాజు, అశోక్, దేవరాజ్, రమణ, మాణిక్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here