శేరిలింగంపల్లి, జూలై 31 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా మాజీ ఎంపీపీ, రంగారెడ్డి జిల్లా బీసీ అధ్యక్షుడు కే రాములు యాదవ్ , వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు మధు యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డబ్బు కొట్టు హరిబాబు, పాండు యాదవ్, సీనియర్ జర్నలిస్ట్, యాదవ సంఘం నాయకుడు సాయిలు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఇది సరియైన సమయమని అన్నారు. రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సామాజిక న్యాయం కోసం ఏకైక మార్గం పోరాటమే అని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు బిసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడం ధర్మంగా భావిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు రావడం, 42% రిజర్వేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తప్పకుండా ఇవ్వాలని అన్నారు. బీసీల రాజ్యాధికార సాధన కోసం బీసీ ఉద్యమమే లేవనెత్తాలని సూచించారు.






