శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏప్రిల్ 13వ తేదీన యాదవ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాదవ రాజకీయ సదస్సుకు యాదవులు, బీసీలు హాజరై విజయవంతం చేయాలని బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. యాదవ్‌లపై కొనసాగుతున్న రాజకీయ అన్యాయాన్ని ఇక సహించబోమని, ఐక్య శక్తితో హక్కులు సాధించాలని అన్నారు. 13న జరగనున్న యాదవ్ జేఏసీ మహాసభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యాదవ్ జేఏసీ రాజకీయ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం యాదవ్ సమాజంలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు. ఈ మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి యాదవ్ నాయకుడు, కార్యకర్త తండోపతండాలుగా హాజరై చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. ఈ సభ యాదవ్ సమాజ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివశంకర్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి యాదవ్, కుమార్ యాదవ్, వంశీ యాదవ్, రాజు యాదవ్, కిరణ్ యాదవ్, నిఖిల్ యాదవ్, విక్కీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






