మెగా అభినందన సభకు ఎంపీ వేం నరేందర్ రెడ్డికి స్పీక్ సంస్థ ఆహ్వానం

శేరిలింగంప‌ల్లి, మే 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నూతనంగా ఎన్నికైన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మహిళా కమిషన్ చైర్ ప‌ర్స‌న్, బీసీ వెల్ఫేర్ అడ్వైజర్ ఫర్ గవర్నమెంట్ తదితర ప్రముఖులను సన్మానించేందుకు జూన్ 4న ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించనున్న మెగా అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరుకావాల‌ని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని స్పీక్ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్పీక్ సంస్థ ఆహ్వాన కమిటీ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు, స్పీక్ చైర్మన్ విద్యాసాగర్, అడ్వైజ‌ర్ సత్యనారాయణ ఎంపీని కలసి సభకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా పీఏసీ చైర్మన్ ఆరికెపూడి గాంధీ, బండి రమేష్ తదితరులను కూడా సభకు ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here