శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటైన శేరిలింగంపల్లి డివిజన్ కార్యాలయం ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా నిలుస్తుందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. నూతన హంగులతో ఏర్పాటైన డివిజన్ కార్పొరేటర్ కార్యాలయాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు నిర్వహించి పిఏసీ ఛైర్మెన్, నియోజకవర్గ ఎంఎల్ఏ ఆరెకపూడి గాంధీతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు అయిన ప్రజా వేదిక నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దరమే లక్ష్యమన్నారు.

డివిజన్ పునర్విభజనతో మరింత బాధ్యత పెరిగిందని, మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురప్రముఖులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





