శేరిలింగంపల్లి, మే 8 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగసభను విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టామని, పెట్రోలియం ఉత్పత్తుల టెర్మినల్ ప్రారంభోత్సవం, బీబీ నగర్ లో ఎయిమ్స్, కాజీపేట – విజయవాడ 3వ రైల్వే లైన్, కాజీపేట – పెద్దపల్లి బైపాస్ లైన్, రాష్ట్రానికి 5 వందే భారత్ ట్రైన్స్ కేటాయింపు తదితర అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి భరోసా బీజేపీ పార్టీ అని అన్నారు.

పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని, నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ అలె ప్రభాకర్ రాజ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ మూడవ సారి ప్రధానిగా ఎన్నికయ్యాక తెలంగాణకు వస్తున్న సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ నుండి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొనేట్లు డివిజన్, బూత్ నాయకులు, వివిధ మోర్చా నాయకులు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి రవీందర్ రావు, అజిత్, ప్రొఫెషనల్ సెల్ కన్వీనర్ బాల్దా అశోక్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి పద్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు స్రవంతి, సీనియర్ నాయకుడు వసంత్ యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కేశవ రావు, రాష్ట్ర , జిల్లా, నియోజకవర్గ డివిజన్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు, నాయకులు, పదాధికారులు, ప్రభారీలు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.





