- హెచ్సీయూలో ఓబీసీ ఉద్యోగ, విద్యార్థుల సత్యాగ్రహ దీక్షకు ఎన్సీఆర్సీ రాష్ట్ర చైర్మన్, జాగృతి రాష్ట్ర నాయకులు నలమాస శ్రీకాంత్ గౌడ్, జిల్లా చైర్మన్ చింతకింది మహేందర్ గౌడ్ ల మద్దతు
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఓబీసీ ఉద్యోగ, విద్యార్థులు చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ఎన్సీఆర్సీ రాష్ట్ర చైర్మన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, జిల్లా చైర్మన్ చింతకింది మహేందర్ గౌడ్ లు మద్దతు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓబీసీ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యూజీసీ మార్గదర్శకాలను పాటించడం లేదని, ఆ విషయాన్ని ఎవరైతే ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఉద్యోగులకు మెమోలు ఇవ్వడం చేతకానితనం అని అన్నారు. తక్షణమే ఓబీసీలకు వ్యతిరేకిగా మారిన వీసీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నాన్ టీచింగ్ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా, పీహెచ్డీ, ఎంఫిల్ అడ్మిషన్స్ లో ఒబిసిలకు అన్ని అర్హతలున్నా సీట్లు కేటాయించకపోవడంతో వీసీ అప్పారావు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో అర్ధమవుతున్నాయన్నారు. తక్షణమే వీటన్నింటినీ సవరించి ఒబిసిలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఒబిసిల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ ఉద్యోగ సంఘ నేత అరవండి రవికుమార్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, జాతీయ కో ఆర్డినేటర్ జాజుల నరేష్ యాదవ్, ఎన్ఈసీ మెంబర్ అరుణ్ కేతన్, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ వై.శివకుమార్, జనరల్ సెక్రటరీ కొండల్, నాన్ టీచింగ్ ఉద్యోగులు, స్టాఫ్ యూనియన్ అధ్యక్షుడు బాలకృష్ణ, జనరల్ సెక్రెటరీ ఎ. రవి గౌడ్, గంగాధర సంతోష్ ముదిరాజ్, ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ మెంబర్లు, టీచింగ్ ఉపాధ్యాయులు, అధికారులు, యూనివర్సిటీలోని పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.






