వ‌ర‌ద బాధితుల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది

  • ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొండాపూర్ డివిజన్ మార్తాండ‌ నగర్ కాలనీలో వరదల వల్ల దెబ్బ తిన్న పేద కుటుంబాలకి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అంద‌జేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా వరదల వల్ల దెబ్బతిన్న కుటుంబాలకి చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తక్షణ సహాయకంగా రూ.550 కోట్లు విడుదల చేయడం చాలా సంతోషమని కొనియాడారు. వరదల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, రజినీకాంత్, స్థానికులు పాల్గొన్నారు.

మార్తాండ‌న‌గ‌ర్‌లో బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

అంజ‌య్య‌న‌గ‌ర్‌లో…

కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో వరదల వల్ల దెబ్బ తిన్న పేద కుటుంబాలకి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, తెరాస నాయకులు రవి, పద్మ శ్రీ, శ్రీదేవి, స్థానికులు పాల్గొన్నారు.

అంజయ్య నగర్ కాలనీలో స‌హాయం అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

గ‌చ్చిబౌలిలో…

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గాలో వ‌ర‌ద‌ల‌ వల్ల దెబ్బ తిన్న పేద కుటుంబాలకి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, తెరాస నాయకులు నరేష్, జగదీష్, సతీష్, శ్రీకాంత్, సలావుద్దీన్, లియాకత్, అజ్మద్, స్థానికులు పాల్గొన్నారు.

దర్గాలో వ‌ర‌ద స‌హాయం అంద‌జేస్తున్న ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here