చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆలయంలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బుధవారం సాయంత్రం గంగారం గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. స్థానిక భక్తులు అమ్మవారికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక పెద్ద చెరువులో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం యాదవ్, కమిటీ సభ్యులు శ్రవణ్ కుమార్, ఆర్ రవి కుమార్, నరసింహ, దినేష్, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

