ఫుడ్ పాయిజ‌నింగ్ బాధిత విద్యార్థుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి: కొమిరిశెట్టి సాయిబాబా

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర‌వ‌డంతో వారిని కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కి చికిత్స కోసం తరలించారు. 44 మంది విద్యార్థులలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో రెయిన్‌బో హాస్పిటల్ లో చేర్పించారు. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఉపాధ్యాయుల‌ నుండి వివరాలు తెలుసుకొని అస్వస్థత కు గురైన విద్యార్థులను పరామర్శించడానికి రెయిన్బో హాస్పిటల్ ను సందర్శించి అక్కడ ఉన్న వైద్య సిబ్బంది తో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించి, విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here